
DSports 15 Nov:భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రీడ పికిల్‌బాల్ జాతీయ స్థాయిలో జరిగిన టోర్నమెంట్‌లో తెలంగాణ రాష్ట్రం సత్తా చాటింది. బెంగళూరు వేదికగా జరిగిన IPA నేషనల్స్ 2025 ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి, 40+ పురుషుల టీమ్ టైటిల్‌ను గెలుచుకుంది.
ఈ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు తమ బలమైన ప్రత్యర్థి అయిన ఆతిథ్య జట్టు కర్ణాటకపై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఫైనల్ మ్యాచ్‌లో తెలంగాణ డ్యూయో కచ్చితమైన కదలికలు, వేగవంతమైన రిటర్న్‌లతో కర్ణాటకకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తి పట్టు సాధించింది. తుది పోరులో తెలంగాణ 21-7 తేడాతో నిర్ణయాత్మక విజయాన్ని సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం జాతీయ పికిల్‌బాల్ క్రీడా పటంలో తెలంగాణ స్థానం బలోపేతం అవుతున్నట్లు స్పష్టం చేసింది.
