
DNews:12 NOV:హైదరాబాద్, సైబర్ నేరగాళ్లు ఇప్పుడు భూమి రిజిస్ట్రేషన్ రికార్డులపై కన్నేశారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాశతో ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్న ఈజీ మనీ గ్యాంగులు ఇప్పుడు “భూ రికార్డు అప్‌డేట్” పేరుతో స్కామ్‌లు చేస్తున్నారు.
ఇప్పటివరకు బ్యాంక్ కేవైసీ అప్‌డేట్, పార్ట్‌టైం జాబ్స్, స్టాక్ మార్కెట్ టిప్స్, పెట్టుబడి అవకాశాల పేరుతో మోసాలు చేసిన సైబర్ గ్యాంగులు, ఇప్పుడు భూమి రిజిస్ట్రేషన్ వివరాలపై నకిలీ లింకులు పంపి ప్రజలను మోసం చేస్తున్నారు.
“మీ భూమి రిజిస్ట్రేషన్ వివరాలు అప్‌డేట్ చేసుకోవాలి” అంటూ ఫేక్ లింకులు వాట్సాప్, మెయిల్ లేదా మెసేజ్‌ల ద్వారా పంపుతున్నారు.ఆ లింకులను క్లిక్ చేస్తే వ్యక్తిగత వివరాలు, ఆధార్, ఫోన్ నంబర్, ఓటీపీ వంటి సున్నితమైన సమాచారం నేరగాళ్ల చేతుల్లో పడిపోతుంది.
అధికారుల హెచ్చరిక
సైబర్ సెక్యూరిటీ అధికారులు ప్రజలకు ముఖ్య హెచ్చరికలు జారీ చేశారు —ఫేక్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ లింకులు, వెబ్‌సైట్లను నమ్మొద్దు.మీ భూమి వివరాలు తెలుసుకోవాలంటే ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లు మాత్రమే ఉపయోగించండి.ఆధార్, ఓటీపీ, ఫోన్ నంబర్ వంటి వివరాలు ఎవరికీ చెప్పొద్దు.భూమి వివరాలు తెలుసుకోవడానికి తెలంగాణలో ‘భూభారతి’ (https://dharani.telangana.gov.in) మరియు ఆంధ్రప్రదేశ్‌లో ‘మీ భూమి’ (https://meebhoomi.ap.gov.in) వెబ్‌సైట్లను మాత్రమే ఉపయోగించాలి.
ప్రజలకు సూచన
అధికారులు ప్రజలను హెచ్చరిస్తూ — “ఫేక్ వెబ్‌సైట్లలో డేటా ఎంటర్ చేస్తే పెద్ద మోసం జరుగుతుంది. కాబట్టి మీ భూమికి సంబంధించిన సమాచారం కోసం అధికారిక పోర్టల్స్‌నే ఆశ్రయించండి” అని విజ్ఞప్తి చేశారు.
