Allu Arjun-Atlee’s ‘Raaka’ Creates Guinness World Record with 37-Person Motion Capture!

D News: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. భారీ స్థాయి విజువల్స్, అత్యాధునిక టెక్నాలజీతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌లో అరుదైన ఘనత నమోదైంది. ఒకేసారి 37 మంది పెర్ఫార్మర్లను రియల్‌టైమ్‌లో మోషన్ క్యాప్చర్ చేసినందుకు ‘రాకా’ టీమ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది.

37 మందితో ఏకకాలంలో మోషన్ క్యాప్చర్

‘రాకా’ కోసం మేకర్స్ భారీ స్థాయిలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో 37 మంది పెర్ఫార్మర్లను ఒకేసారి రియల్‌టైమ్‌లో క్యాప్చర్ చేశారు. గతంలో ఉన్న రికార్డును అధిగమిస్తూ ఈ ఘనతను సాధించినట్లు తాజా సమాచారం వెల్లడించింది. దీంతో ‘రాకా’ పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది.

ఇటీవల మేకర్స్ వరుసగా ‘37’ అనే నంబర్‌తో పోస్టర్లు, అప్‌డేట్స్ ఇవ్వడంతో అసలు దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటనే ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఆ సంఖ్యకు మోషన్ క్యాప్చర్ రికార్డ్‌తో సంబంధం ఉన్నట్లు స్పష్టమైంది.

టెక్నాలజీపై భారీగా ఫోకస్

అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ‘రాకా’ను భారీ విజువల్ స్కేల్‌లో తెరకెక్కిస్తున్నారు. సినిమా కథ, పాత్రలు, విజువల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ ఇప్పటివరకు గోప్యంగా ఉంచుతున్నారు. అయితే మోషన్ క్యాప్చర్, వీఎఫ్‌ఎక్స్ వంటి టెక్నాలజీకి ఇస్తున్న ప్రాధాన్యత మాత్రం ఈ తాజా రికార్డ్‌తో మరోసారి స్పష్టమైంది.

అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణెతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రిలీజ్‌కు ముందే గిన్నిస్ రికార్డ్ సాధించిన ‘రాకా’ నుంచి రాబోయే మరిన్ని అప్‌డేట్స్‌పై ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

By Avinash