DNews:12 NOV:మెదక్ టౌన్‌, జిల్లా వ్యాప్తంగా ఈనెల 15న నిర్వహించనున్న ప్రత్యేక లోక్‌ అదాలత్‌లో కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు సూచించారు.

మంగళవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ — ఈ లోక్‌ అదాలత్‌లో క్రిమినల్‌, సివిల్‌, ఆస్తి విభజన, వైవాహిక, కుటుంబ, డ్రంకన్‌ డ్రైవ్‌, చెక్‌ బౌన్స్‌, బ్యాంకు రికవరీ, విద్యుత్‌ చౌర్యం వంటి కేసులు రాజీ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు.

న్యాయశాఖ అందిస్తున్న ఈ ప్రత్యేక అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్‌ అధికారులు, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు (SHOs), కోర్టు విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు రాజీ పడియే అవకాశమున్న కేసులను గుర్తించి, సంబంధిత కక్షిదారులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని ఎస్పీ ఆదేశించారు.

ఎస్పీ శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ — “లోక్‌ అదాలత్‌లు ప్రజలకు న్యాయం త్వరగా, తక్కువ వ్యయంతో అందించే వేదికలు. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి” అని అన్నారు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana