
DNews:22 Nov:తెలంగాణ డీజీపీ బీ. శివధర్ రెడ్డి గారి ఎదుట శనివారం నాడు మొత్తం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉండగా, లొంగిపోయిన వారిలో 25 మంది మహిళలే ఉన్నారని డీజీపీ తెలిపారు.సాంబయ్య అలియాస్ ఆజాద్ (మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు):తాము పార్టీకి చెప్పే లొంగిపోయామని తెలిపారు.ప్రస్తుత పరిస్థితుల్లో జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టు పార్టీ కూడా పిలుపునిస్తుందని పేర్కొన్నారు.స్టేట్ కమిటీలో ఉన్న ఇంకా ఇద్దరు అగ్రనేతలు కూడా లొంగిపోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.మారుతున్న పరిస్థితుల్లో ఉద్యమాన్ని నడిపించడం కష్టమని తెలిపారు.తామంతా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని నిర్ణయం తీసుకున్నామని, తమ ఆరోగ్య పరిస్థితులు కూడా సహకరించడం లేదని చెప్పారు.మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోవడం మంచిదని పిలుపునిచ్చారు.లొంగిపోయిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.స్వాధీనం చేసుకున్న ఆయుధాలు: 303 రైఫిల్స్, జీ3 రైఫిల్స్, ఏకే 47లు, ఎస్‌ఎల్‌ఆర్ మరియు భారీగా బుల్లెట్లను వారు అప్పగించారని పేర్కొన్నారు.ప్రభుత్వ సహాయం: లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డు నగదుతో పాటు మరికొన్ని వెసులుబాట్లు కూడా కల్పిస్తామని డీజీపీ హామీ ఇచ్చారు.
