DNews:12 Dec: హైదరాబాద్ చదువు చెప్పమని ట్యూషన్‌కు పంపించిన ఏడేళ్ల బాలుడిపై ఓ టీచర్ అమానుష హింసకు పాల్పడిన ఘటన నగరంలోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఓయూ కాలనీకి చెందిన 1వ తరగతి విద్యార్థి తేజ నందన్‌ను శ్రీ మానస అనే టీచర్ దగ్గరకు ట్యూషన్‌కు పంపుతున్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.బాలుడు చదవడంలేదనే కారణంతో టీచర్ అట్లకర్రతో కాళ్లు, చేతులు, ముఖం సహా ఎనిమిది చోట్ల వాతలు పెట్టిందని ఆరోపణలు ఉన్నాయి.ఈ దాడితో బాలుడి చర్మం ఊడిపోయేంతగా గాయాలు అయ్యాయి. కాలి గాయాల తీవ్రత కారణంగా బాలుడు ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉన్నాడు.విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, చిన్నారిని వైద్య పరీక్షల కోసం గోల్కొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు.తమ కుమారుడిపై ఈ రకంగా దారుణంగా వ్యవహరించిన టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తేజ నందన్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana