
DNews:24 Nov:మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో సర్పంచ్ స్థానాలు బీసీలకు కేటాయించాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి డిమాండ్ చేసింది. ఆత్మ చైర్మన్ రౌతు సత్తయ్య, మాజీ సర్పంచ్ దుస్స చందు ఆధ్వర్యంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌కు వినతి పత్రం అందజేశారు.
వారి వివరాల ప్రకారం—మండలంలో ఒక్క గ్రామ పంచాయతీ కూడా బీసీ వర్గాలకు రిజర్వ్ చేయకపోవడం తీవ్ర అన్యాయమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో రెండు గ్రామ పంచాయతీలు బీసీలకు కేటాయించగా, తాజా రిజర్వేషన్లలో ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం అసమంజసమని పేర్కొన్నారు.
కాసిపేట మండలంలో బీసీ జనాభా అత్యధికమై ఉన్నప్పటికీ, వారికి సర్పంచ్ రిజర్వేషన్ ఇవ్వకపోవడం అన్యాయం చేస్తున్నట్లేనని తెలిపారు. బీసీలకు న్యాయబద్ధంగా రిజర్వేషన్లు కేటాయించాలని సమితి డిమాండ్ చేసింది.ఈ వినతి పత్రం సమర్పణ కార్యక్రమంలో నాయకులు తిరుపతి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
