
DNews: Nov 24: ముషీరాబాద్‌లో కొత్తగా స్థాపించబడిన చిక్కడపల్లి ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో GHMC డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, ముషీరాబాద్ డివిజన్ కార్పొరేటర్ సుప్రియా గౌడ్, ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ సందర్భంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణకు పూలగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అనిల్‌కుమార్, జిల్లా అధికారి పంచాక్షరి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్వైజర్ శ్రీనివాస్, ముషీరాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఎక్సైజ్ SSIలు శ్రవణ్‌కుమార్ రావు, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అధికారులు మాట్లాడుతూ, కొత్తగా ఏర్పాటైన చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో 12 వైనరీలు, 11 బార్లు, 4 తాటి కాంపౌండ్లు ఉంటాయని తెలిపారు. అలాగే చిక్కడపల్లి, గాంధీనగర్, దొమలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రాంతాలు ఈ కొత్త స్టేషన్ పరిధిలోకి వస్తాయని వివరించారు.
