
DNews:17 NOV:జోగులాంబ గద్వాల జిల్లాలో సీసీఐ (CCI) కొనుగోలు కేంద్రాల వద్ద పత్తి కొనుగోలులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ రైతులు పత్తి వాహనాలతో సహా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు.
రైతుల ఆవేదన కొనుగోలు నిరాకరణ రైతులు తమ పత్తిని అమ్మకానికి స్లాట్ బుక్ చేసుకుని వారం రోజులు పూర్తయినా, సోమవారం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చినప్పటికీ అధికారులు కొనుగోలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.అన్నదాతకు అడుగడుగునా అవస్థలే ఎదురవుతున్నాయని, ఈ సంవత్సరం భారీ వర్షాల కారణంగా పత్తి పంట నష్టపోయిందని, మిగిలిన పంటను కొనుగోలు చేయడానికి కూడా అధికారులు, ప్రభుత్వం జాప్యం చేస్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు వెంటనే కలెక్టరేట్‌కు చేరుకుని ఆందోళన నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి, రైతులు తీసుకొచ్చిన పత్తిని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
