DNews:22 Nov:నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో రిమాండ్ ఖైదీ పరారైన ఘటన కలకలం రేపుతోంది. వారం రోజులు గడిచినా ఆయన్ను పోలీసులు గుర్తించలేకపోవడంతో సంబంధిత సిబ్బందిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం వీరాపురం గ్రామానికి చెందిన నాగిరెడ్డి అంతర్రాష్ట్ర దొంగగా గుర్తింపు పొందాడు. ఏపీ, తెలంగాణలో అనేక చోరీకేసుల్లో నిందితుడైన అతడు అనంతపురం జిల్లా జైలులో ఖైదీగా ఉన్నాడు.వివిధ కేసుల విచారణ నిమిత్తం ఈ నెల 11న అతన్ని కల్వకుర్తి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే 13వ తేదీ రాత్రి పీఎస్‌లో ఉన్న సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్తానని చెప్పి లోపలికి వెళ్లిన నాగిరెడ్డి, వెంటిలేటర్ అద్దాలను పగలగొట్టి అక్కడి నుంచి పారిపోయాడు. చాలా సేపు బయటకు రాకపోవడంతో పోలీసులు లోపలికి వెళ్లి చూస్తే విషయం తెలిసింది.

రాత్రి వెంటనే బస్ స్టాండ్ సహా పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు నుంచి జిల్లా, రేంజ్‌వ్యాప్తంగా శోధన కొనసాగుతున్నప్పటికీ అతని స్థానం ఇంకా తెలియలేదు.ఈ ఘటనలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించిన ఉన్నతాధికారులు కింది చర్యలు చేపట్టారు:SI మాధవరెడ్డి కి చార్జ్ మెమో జారీ హెడ్ కానిస్టేబుల్ నిరంజన్ నాయక్, కానిస్టేబుల్ లాల్ సింగ్ నాయక్ సస్పెండ్, హోంగార్డ్ లక్ష్మణ్ ను వనపర్తి ఎస్పీ కార్యాలయానికి అటాచ్రిమాండ్ ఖైదీ పరారైన ఈ సంఘటనతో పోలీసు వ్యవస్థపై ప్రశ్నలు నెలకొన్నాయి. కోసం ఇంకా శోధన కొనసాగుతోంది.

By rajesh

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana