
DNews:03 Dec:రంగారెడ్డి జిల్లా కడ్తాల్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కారు ఇవాళ ఉదయం అగ్నిప్రమాదానికి గురైంది. మక్తమాదారం గేట్ దగ్గరకు వచ్చేసరికి కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో కారులో ఉన్న నలుగురు ప్రయాణికులు వెంటనే బయటకు దిగి ప్రాణాలు నిలబెట్టుకున్నారు. ఎవరికీ స్వల్ప గాయాలు కూడా కాలేదు.అగ్నిలో కారు పూర్తిగా దగ్ధమైంది. తలకొండపల్లి మండలం వెంటాపూర్ నుంచి యువకులు హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రాథమిక అంచనా ప్రకారం షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.అంతేకాక, ఈ ప్రమాదంపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్థానిక పోలీసులు తెలిపారు. విచారణ కొనసాగుతోంది.
