DNews:22 Nov:హైదరాబాద్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక మున్సిపల్ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూపాలపల్లి మున్సిపల్‌లో ఉద్యోగం చేస్తున్న బెల్లం రాజయ్య అనే కార్మికుడిని, మున్సిపాలిటీ పరిధిలో కాకుండా సింగరేణి ప్రాంతంలోని కృష్ణ కాలనీలో చెట్లు నరకడానికి అధికారులు పంపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.సింగరేణి ప్రాంతంలో చెట్లు నరికే పనిలో ఉండగా రాజయ్య ప్రాణాలు కోల్పోయాడు.సింగరేణి పరిధిలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఉన్నా కూడా, ఎందుకు మున్సిపల్ కార్మికుడిని అక్కడికి పంపారంటూ కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.

రాజయ్య మృతదేహంతో కుటుంబ సభ్యులు, తోటి మున్సిపల్ కార్మికులు భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు.అధికారులు మృతికి కారణాలు చెప్పాలని, బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.ఆందోళన సందర్భంగా అక్కడ పరిస్థితులు ఉద్రిక్తమయ్యాయి.పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు.మహిళలను కూడ ఈడ్చుకెళ్లిన దృశ్యాలు ఉద్రిక్తతను మరింత పెంచాయి.స్థానిక కార్మిక సంఘాలు, కుటుంబ సభ్యులు రాజయ్యకు న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana