
DNews:02 Dec:హైదరాబాద్‌లోని బాచుపల్లి ప్రాంతంలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన వర్షిత (వయస్సు 16) అనే ఇంటర్ తొలి సంవత్సరం విద్యార్థిని సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఆమె బాచుపల్లిలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో చదువుతూ, హాస్టల్లో నివసిస్తోంది.హాస్టల్ గదిలో వర్షిత తాళం వేసుకుని ఎక్కువసేపు బయటకు రాకపోవడంతో నిర్వాహకులు అనుమానించారు. తలుపు తెరిచి చూడగా ఆమె ఉరివేసుకుని ఉండటం గమనించారు. వెంటనే కాలేజీ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.పోస్టుమార్టం కోసం దవాఖానకు తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.వర్షిత ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యులను, స్నేహితులను, కాలేజీ యాజమాన్యాన్ని పోలీసులు విచారిస్తున్నారు.
