
DNews:09 Dec: ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలకు విరుద్ధంగా అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్న అధికారులు మరియు ఉద్యోగులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కఠిన చర్యలు చేపడుతోంది. ఇటీవల నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి సబ్ డివిజన్ పరిధిలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్‌గా (ADE) పని చేస్తున్న ఎద్దుల వెంకటేశ్వరు (ADE Venkateshwarlu) లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులచే పట్టుబడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
వెల్దండ మండలం చొక్కన్నపల్లి గ్రామానికి చెందిన ఒక బాధితుడు తన ఇంటి వద్ద ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయించుకోవడం, తన పేరుపై విద్యుత్ మీటర్ ఏర్పాటు చేయించుకోవడం కోసం విద్యుత్ శాఖ అధికారులతో సంప్రదించగా, ఏడీఈ రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశారు. అయితే, మంగళవారం రూ. 15 వేలు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఏడీఈని హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరు చేశారు అని అధికారులు వెల్లడించారు. ఈ చర్య ద్వారా అవినీతి చట్టం కింద న్యాయం సాదించేందుకు బలమైన సందేశం పంపబడింది. బాధితుల ఫిర్యాదులకు తక్షణ స్పందిస్తూ, అవినీతి నిరోధక శాఖ తమ పంజా విసురుతూనే ఉందని తెలుస్తోంది.
