DNews: Dec 09: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఒకే రోజు రెండు బెదిరింపు ఇమెయిల్స్ రావడంతో విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమయ్యారు. తెలియని వ్యక్తులు ఒక మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, డబ్బు ఇవ్వకపోతే విమానాశ్రయంలో ప్రజలపై కాల్పులు జరిపి బాంబు పెట్టేస్తామని హెచ్చరించారు. అదనంగా, అమెరికాకు వెళ్లే విమానాన్ని హైజాక్ చేసి బెంగళూరులో క్రాష్ చేస్తామని మరో ఇమెయిల్‌లో పేర్కొన్నారు. ఈ బెదిరింపు ఇమెయిల్ పంపిన చిరునామా editor@epochtimes.cpm, ఫోన్ నంబర్ +1-2016143989 అని అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో, ఉదయం కూడా ఒక బెదిరింపు ఇమెయిల్ రావడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. న్యూయార్క్‌కు చెందిన జాస్పర్ ప్యాకర్డ్ అనే వ్యక్తి ఈమెయిల్ పంపినట్లు గుర్తించారు. అమెరికాకు వెళ్లే విమానాల్లో బాంబు పెట్టి, టేకాఫ్ అయిన పది నిమిషాల్లో పేల్చేస్తానని, పేలకపోతే ఒక మిలియన్ డాలర్లు చెల్లించాలని బెదిరించాడు. వెంటనే విమానాశ్రయ అధికారులు అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. రెండోసారి ఇలాంటి బెదిరింపు రావడంతో మరింత విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

By Mosha

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana