DNews:22 Nov:హైదరాబాద్‌ నగరాన్ని మరోసారి కలచివేసిన ఘటన చోటుచేసుకుంది. బేగంపేటలోని ఓ ప్రైవేట్ ఏవియేషన్ సంస్థలో పనిచేస్తున్న 26 ఏళ్ల మహిళా అసిస్టెంట్ పైలట్‌పై, అదే సంస్థలో పనిచేస్తున్న సీనియర్ కమర్షియల్ పైలట్ రోహిత్ శరణ్‌ (60) లైంగిక దాడికి యత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ధైర్యసాహసంతో ఈ విషయం పైన వెలుగు పడింది.

ఈ నెల 20న ఉద్యోగపరమైన పనిలో భాగంగా బేగంపేట నుండి పుట్టపర్తి మీదుగా బెంగళూరు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. బిజినెస్ ఫ్లైట్‌లో ఇద్దరూ కలిసి ప్రయాణించగా, అక్కడ ఒక హోటల్‌లో ఆమెతో పాటు మరో ఇద్దరు పైలట్లు కూడా బస చేశారు. ఇదే సమయంలో రోహిత్ శరణ్ హోటల్ గదిలో ఆమెను ఒంటరిగా చూసి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.

తనపై దాడి ప్రయత్నం జరుగుతున్నప్పుడు అసిస్టెంట్ పైలట్ ధైర్యంగా ప్రతిఘటించి అక్కడి నుంచి బయటపడ్డది. వెంటనే హైదరాబాద్‌కు చేరుకున్న ఆమె బేగంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, ఘటన చోటుచేసుకున్న ప్రదేశం బెంగళూరు హలసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందన్న కారణంగా కేసును అక్కడికి బదిలీ చేశారు.

ఈ సంఘటన మహిళా భద్రత, ఉద్యోగ ప్రదేశాల్లో సురక్షిత వాతావరణం, సీనియర్ ఉద్యోగుల బాధ్యత వంటి అంశాలపై మళ్లీ చర్చకు దారితీసింది. ఒక మహిళా పైలట్‌ తన ధైర్యంతో బయటపెట్టిన ఈ ఘటన, సిస్టమ్‌లోని లోపాలను బయటపెడుతూ, మహిళలు ఏ ఉద్యోగంలో ఉన్నా భద్రత అత్యంత ముఖ్యమని మరోసారి గుర్తుచేస్తోంది.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana