DNews:NOV 12:ఇంకో రెండు నెలల్లో తెలుగు లోగిళ్లల్లో సంక్రాంతి పండుగ సందడి ప్రారంభం కానుంది. ఈ పండుగ సందర్భంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో నివసించే తెలుగువారు సొంతూళ్లకు ప్రయాణం కట్టడం ఆనవాయితీ. ఈ ప్రయాణానికి సంబంధించి రైలు టికెట్ల బుకింగ్‌పై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. సాధారణంగా రైలు టికెట్లను 60 రోజుల ముందుగా బుక్ చేసుకునే వెసులుబాటు ఉండగా, ఈ నిబంధన ప్రకారం సంక్రాంతి పండుగ ప్రయాణానికి సంబంధించిన అడ్వాన్స్‌డ్ టికెట్ బుకింగ్ ఈ నెల (నవంబర్) 13వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ముఖ్యంగా, జనవరి 12వ తేదీ ప్రయాణానికి సంబంధించి టికెట్లు నవంబర్ 13న అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా, జనవరి 14వ తేదీ ప్రయాణానికి నవంబర్ 15న, జనవరి 15వ తేదీ ప్రయాణానికి నవంబర్ 16న బుకింగ్ మొదలవుతుంది. టికెట్ల బుకింగ్‌లో ఆలస్యం చేస్తే ప్రైవేట్ బస్సుల ఛార్జీలు వేలకు వేలు (రూ. 3,000 నుంచి రూ. 5,000 వరకు) చెల్లించాల్సి రావచ్చు లేదా రైళ్లలో బెర్త్ లేకుండా భయంకరమైన ప్రయాణం చేయాల్సి రావచ్చు. కాబట్టి ప్రయాణికులు ప్రత్యేక రైళ్ల కోసం ఎదురుచూడకుండా, ఈ అడ్వాన్స్‌డ్ బుకింగ్ పద్ధతిని ఉపయోగించుకుని సులభంగా బెర్త్‌లను పొందాలని సూచించడమైనది.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana