DNews:25 Nov:హైదరాబాద్, శాలిబండ గోమతి ఎలక్ట్రానిక్స్‌ షాప్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై మొగల్‌పురా పోలీసులు, విద్యుత్‌ శాఖ అధికారులు అత్యంత వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటన వెనుకున్న అసలు కారణం ఏమిటనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ప్రమాద స్థలానికి అత్యంత సమీపంలో ఉన్న కారు డ్రైవర్ మణికంఠను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు.డ్రైవర్ ఇచ్చిన వివరాలు దర్యాప్తులో కొత్త మలుపు తిప్పాయి, రాత్రి 10:30 గంటల సమయంలో భారీ బ్లాస్ట్ లాంటి శబ్దం వినిపించిందని తెలిపారు.ఆ శబ్దం కారణంగా తన కారు పల్టీ కొట్టిందని చెప్పారు.కారు గ్లాస్ మొత్తం పగిలిపోయి ధ్వంసమైనట్లు పేర్కొన్నారు.కారు లోపల తానే ఒక్కడినేనని, ముందరి అద్దాలను పగలగొట్టి బయటపడ్డానని తెలిపారు.బయటకు రాగానే కారు పూర్తిగా మంటల్లో కాలిపోయిందని చెప్పారు.ముఖ్యంగా — కారులోని CNG సిలిండర్ ఎలాంటి పేలుడు చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు.తాను EVEREST FLEET COMPANY PVT LTD కంపెనీకి చెందిన ఉబర్ కారును నడుపుతున్నానని వెల్లడించారు.చార్మినార్‌లో ప్యాసింజర్‌ను డ్రాప్ చేసి, తదుపరి పికప్ కోసం శాలిబండ వైపు వస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగిందని చెప్పారు.

కొత్త కోణంలో దర్యాప్తు

డ్రైవర్ సమాచారం నేపథ్యంలో, పోలీసులు ప్రస్తుతం షాప్‌లో షార్ట్‌సర్క్యూట్ జరిగి ఉండవచ్చా? అనే కోణాన్ని ప్రధానంగా పరిశీలిస్తున్నారు.అసలు పేలుడు నాది? షాప్‌లోనిది? లేదా వేరే కారణమా? అన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు.అందుకే అధికారులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana