DNews:03 Dec:హైదరాబాద్ మలక్‌పేట–దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన రహదారిపై మంగళవారం అర్ధరాత్రి భయానక ఘటన చోటుచేసుకుంది. ఆస్మాన్‌గఢ్ వైపు నుంచి వస్తున్న టిప్పర్ లారీ మలక్‌పేట చౌరస్తా టీవీ సమీపంలో అదుపుతప్పి దూసుకొచ్చింది. అదుపు కోల్పోయిన లారీ రోడ్డుపై ఉన్న డివైడర్‌ను ఢీకొని ముందున్న ఒక బస్సు, మరో లారీని బలంగా ఢీకొట్టి ఆగిపోయింది.

టిప్పర్ వేగం ఎక్కువగా ఉండడంతో కనిపించిన వాహనదారులు అప్రమత్తమై తప్పించుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.

ఘటన అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జరగడంతో రహదారిపై రాకపోకలు తీవ్రంగా అంతరించాయి. ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న మలక్‌పేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలనలు చేపట్టి, రోడ్డుపై ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

టిప్పర్ బ్రేక్ ఫెయిల్ కావడం వల్లనా? లేదా డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? అనే అంశాలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణను కొనసాగిస్తున్నారు.

By rajesh

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana