DNews:15 NOV:గోషామహల్ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు రాజాసింగ్ మరోసారి సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.

ఆ వీడియోలో రాజాసింగ్ మాట్లాడుతూ, తెలంగాణలో బీజేపీ మరో 50 ఏళ్ల దాకా అధికారంలోకి రాదు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “బీజేపీ నేతలు మొండితనంతో ముందుకు పోతున్నారు. ఎవరి మాట వినడం లేదు. బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఇంకో 50 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కనిపించడంలేదు” అని పేర్కొన్నారు.అలాగే, “ఏ విధంగా గెలవాలి, ఓటరును ఏ విధంగా మన వైపు మళ్లించుకోవాలనే విషయాలను నేర్చుకోండి. ఏదైనా విషయం చెబితే ఆలోచించండి” అని నాయకత్వానికి సూచించారు.

చివరిగా, “తెలంగాణలో బీజేపీ చనిపోతుంది, కిషన్ రెడ్డి గారు దయచేసి కాపాడండి” అంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జీ. కిషన్ రెడ్డిని ఉద్దేశించి రాజాసింగ్ వేడుకున్నారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి.

By rajesh

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana