DNews:15 NOV:హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో ఒక రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. అతివేగంతో దూసుకొచ్చిన కారు అదుపుతప్పి, పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని బలంగా ఢీకొట్టి అనంతరం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న యువతి గాయపడింది. అయితే, ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగులు (Airbags) తెరుచుకోవడంతో ఆమె పెద్ద ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రైవింగ్ సీటులో ఇరుక్కున్న యువతిని, కారు అద్దాలు పగులగొట్టి బయటకు తీసి, చికిత్స నిమిత్తం హుటాహుటిన దవాఖానకు తరలించారు. ప్రాథమిక విచారణలో, సదరు యువతి మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana