DSports:Sep19:జమ్మూలో జరిగిన జాతీయ గ్రాప్లింగ్ (రెజ్లింగ్) ఛాంపియన్‌షిప్‌లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో నారాయణకు చెందిన విద్యార్థులు మూడు బంగారు పతకాలను సాధించి జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకున్నారు.

భారత రెజ్లింగ్ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ గ్రాప్లింగ్ ఛాంపియన్‌షిప్ – 2025లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు ఆయుష్ ఠాకూర్, వైష్ణవి ఠాకూర్ పసిడి పతకాలను గెలుచుకుని తమ పాఠశాలకు, రాష్ట్రానికి కీర్తిని తెచ్చారు.

ఆయుష్ ఠాకూర్ అండర్-11 విభాగంలో పోటీపడి రెండు బంగారు పతకాలను సాధించాడు. వైష్ణవి ఠాకూర్ అండర్-15 విభాగంలో తన సత్తా చాటుకొని బంగారు పతకాన్ని సాధించింది.

ఈ సందర్భంగా నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ పి. సింధూర నారాయణ, డైరెక్టర్ శరణి నారాయణ మాట్లాడుతూ, ఆయుష్ మరియు వైష్ణవి సాధించిన విజయాలు ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా విద్యారంగంలో తమ విద్యాసంస్థలు పాటిస్తున్న విలువలకు ఈ విజయాలు నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే, విద్యార్థులకు భవిష్యత్తులో కూడా క్రీడలలో ప్రోత్సాహం అందిస్తామని, వారి కలలను సాకారం చేయడానికి తోడ్పడతామని హామీ ఇచ్చారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana