DNews:06 NOV:జగిత్యాల జిల్లా మల్యాల పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. నూకపల్లి డబుల్ బెడ్రూం కాలనీకి చెందిన యువకుడు మహ్మద్ అఖిల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

సమయానికి అప్రమత్తమైన పోలీసులు, స్థానికులు అతడిని అడ్డుకొని మంటలు అంటించుకునేలోపే కాపాడి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం స్థిరంగా ఉందని సమాచారం.

తెలుసుకున్న వివరాల ప్రకారం — అఖిల్ తల్లి అన్వర్ బేగం ఇటీవల ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఆమె ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అఖిల్ గత కొన్ని రోజులుగా మల్యాల పోలీస్ స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నాడు. అయితే తన విజ్ఞప్తిని పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన అఖిల్ ఈరోజు తీవ్ర నిర్ణయానికి దిగాడు.

స్టేషన్ ప్రహరీ గోడపైకి ఎక్కి తనపై పెట్రోల్ పోసుకున్న అతడిని అక్కడే ఉన్న పోలీసులు కిందికి దించి ఆపటంలో విజయం సాధించారు. అనంతరం స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అఖిల్ తల్లి ఆత్మహత్య కేసులో సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana