
DNews:17 NOV:జగిత్యాలలోని ఆల్ఫోర్స్ కళాశాల యాజమాన్యం విద్యార్థులను మానసికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి బాగోజీ ముఖేష్ కన్నా సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మార్చిలో జరుగనున్న ఫైనల్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన ఫీజు చెల్లింపు సమయంలో, అకాడమీ ఫీజ్ చెల్లించనిదే పరీక్ష ఫీజ్ తీసుకోబోమని విద్యార్థులను ఆల్ఫోర్స్ కళాశాల యాజమాన్యం భయాందోళనకు గురిచేస్తోందని ముఖేష్ కన్నా మండిపడ్డారు. నిరుపేద విద్యార్థులు ఇప్పుడిప్పుడే అంత పెద్ద మొత్తంలో అకాడమీ ఫీజులు చెల్లించలేరని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను వేధిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాల యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మరియు పూర్తి విచారణ కోసం ఒక కమిటీని నియమించాలని ఆయన కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సేవాదళ్ సభ్యులు రమణ, కిషోర్, పార్థు, రాహుల్, అరుణ్ సహా పలువురు పాల్గొన్నారు.
