
నటీనటులు : కల్యాణి ప్రియదర్శన్,నస్లెన్,చందు సలీమ్‌కుమార్
దర్శకత్వం : డామినిక్ అరుణ్.
ప్రొడ్యూసర్ : దుల్కర్ సల్మాన్.
సినిమాటోగ్రఫి : సినిమాటోగ్రఫి.
ఎడిటర్ : అను మూథేడత్.
రిలీజ్ డేట్ : ఆగస్టు 28,2025.
కొత్త లోక సినిమా మలయాళం చాప్టర్ – 1 చంద్ర అనే డబ్బింగ్ సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల చేసింది.ఇది ఒక తెలుగు మహిళా సూపర్ హీరో సినిమా,దీనికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు మరియు కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించారు.
ఈ మూవీ స్టార్టింగ్ లోనే ఒక సస్పెన్స్ థీమ్ తో మొదలవుతుంది. కిడ్నాపింగ్ కేసులు ఎలా సాల్వ్ చెయ్యాలని ఆలోచిస్తూ,అసలు కిడ్నప్స్ ఎవరు చేస్తున్నారు ? ఎందుకు చేస్తున్నారు ? అనే పోలిసుల అన్వేషణతో మొదలవుతుంది.
సినిమా కథలో మలయాళ సాంప్రదాయ కధలు,యాక్షన్ సన్నివేశాలు మరియు ఫాంటసీ అంశాలు అన్ని కలగలిపి ఉన్నాయి,ఈ మూవీ మిక్స్డ్ ఎమోషన్స్ని కాప్చర్ చేస్తూ తీసిన సినిమా.ఎక్కువగా లాగ్ లేకుండా పాయింట్ ని చాలా సింపుల్ గ ఆడియన్స్ లోకి తీసుకొచ్చారు.
కల్యాణి ప్రియదర్శన్ ఇప్పటికే లవ్ స్టోరీస్ తో ప్రేక్షకులకి చాలా దగ్గర అయ్యింది,కానీ ఈ మూవీ లో కల్యాణి ప్రియదర్శన్ చాలా డిఫరెన్ట్ లుక్ అండ్ యాక్షన్ తో ప్రేక్షకుల అభిమానాన్ని ప్రశంసలను పొందింది.మహిళా యాక్షన్ ఓరియెంటెడ్ మూవీస్ బాక్స్ ఆఫీస్ ముందు ఇంత కలెక్షన్ సాధించడం ఈ విజయమని చెప్పుకోవచ్చు. కల్యాణి ప్రియదర్శన్ యాక్టింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యిందని ఆడియన్స్ చెప్పుకోవడం గమనార్హం,మొత్తానికి డిఫరెంట్ జోనర్ ని సెలెక్ట్ చేసుకుని తన మహిళా యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ లో తన సత్తా చాటుకుంది.
కల్యాణి ప్రియదర్శన్ ఈ సినిమా లో సూపర్ పవర్స్ కలిగి ఉంటుంది,ఆమెకి తప్పిన ప్రమాదం తో ఆలోచనలో పడిన మూతోన్ ఆమెని కొన్ని రోజులు రహస్యంగా ఉండమని చెప్తాడు,మూతోన్ కల్యాణి ప్రియదర్శన్ చంద్ర అలియాస్ నీలి బెంగళూరు కి షిఫ్ట్ అవుతుంది,తన ఇంటికి దగ్గర్లో ఉన్న హీరో తనని చూసి అట్ట్రాక్ట్ అయిపోయి ఎలా అయిన తనతో పరిచయం పెంచుకోవాలని తన కోసం ఆలోచిస్తూ ఉంటాడు.ఈ క్రమంలో చంద్ర పై పోలీస్ లు నిఘా పెడతారు,అసలు పోలీసులకి చంద్రని ఎందుకు ఫాలో చేస్తారు ? చంద్ర పై పోలీసులకి ఎందుకు అనుమానం వస్తుంది ? పోలీసుల దగ్గర నుంచి చంద్ర ఎలా బయటపడుతుంది ? అసలు బయటపడుతుందా ? అనే అంశం తో సినిమా ఉంటుంది.
దుల్కర్ సల్మాన్ కి ఇది వరకే ప్రొడ్యూసర్గా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన ఇప్పటికే చాలా సినిమాలు తన బ్యానర్ మీద విడుదల చేసింది అందరికి తెల్సిందే,హీరోగా సక్సెస్ఫుల్ గా ఉంటూ ప్రొడ్యూసర్ గా కూడా విలువనైనా నిర్ణయాలు తీసుకుంటూ తెలుగు,బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. ఆయన ప్రొడ్యూసర్గా తీసిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ ని సాధించి సక్సెస్ఫుల్ గా ఆడియన్స్ లో నిలిచింది.
ఈ సినిమా లో మైనస్ గా నిలిచినా అంశాల గురించి మాట్లాడితే కామెడీ ట్రై చేసిన ఎక్కువగా ఆకర్షించ లేకపోయారు,ఇంకొంచెం ఆక్షన్ అండ్ థ్రిల్లర్ ని చూపిస్తే బాగుండేది అనిపించింది,హీరో అండ్ హీరోయిన్ మధ్యలో ఉన్న కంటెంట్ కూడా సెకండ్ హాఫ్ లో అంతగా ఆకట్టుకోలేదనే చెప్పుకోవాలి.
ఓవరాల్ గా బాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది ఆడియన్స్ ని బాగా కన్సెక్ట్ చేసారు మ్యూజిక్ తో,అండ్ ఆక్టర్స్ అందరు వాళ్ళ టాలెంట్ ని ఈ మూవీ ద్వారా ప్రూవ్ చేసుకున్నారు.కొద్దికాలంగా వచ్చిన మూవీస్ లో వన్ అఫ్ ది బెస్ట్ గా నిలిచింది అని చెప్పుకోవచ్చు.
