D Entr: Jul 28: మీనా ఇంటర్వ్యూ: దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్రనాయికగా గుర్తింపు పొందిన నటి మీనా తన సినీ ప్రస్థానం, సహ నటులతో ఉన్న అనుబంధం, వ్యక్తిగత అనుభవాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, రాజశేఖర్, మోహన్ బాబు, నరేష్, రాజేంద్ర ప్రసాద్ వంటి అగ్ర హీరోలతో కలిసి నటించిన రోజుల్ని ఆమె గుర్తుచేసుకున్నారు.

తన కెరీర్‌లో అత్యధిక విజయాలు వెంకటేష్‌తోనే వచ్చాయని మీనా తెలిపారు. ఆయనతో కలిసి పనిచేసేటప్పుడు ఎంతో కంఫర్ట్‌గా, స్నేహపూర్వక వాతావరణం ఉండేదని చెప్పారు. కెరీర్ ప్రారంభంలో తాను చాలా మౌనంగా ఉండేదానినని, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి హీరోలతో ఎక్కువగా వృత్తిపరంగానే మెలిగేదానినని వెల్లడించారు. అయితే బాలకృష్ణ మాత్రం ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ తనను కూడా మాట్లాడించేవారని నవ్వుతూ గుర్తు చేసుకున్నారు.

మోహన్ బాబుతో కలిసి పనిచేసిన అనుభవాలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండేవని మీనా తెలిపారు. అల్లరి మొగుడు సినిమా సమయంలో తాను చాలా చిన్నవయస్సులో ఉండటంతో ఆయన సరదాగా ఆటపట్టించడం, బెదిరించినట్లు నటించడం చూసి మొదట్లో కొంచెం భయపడేదానినని చెప్పారు. అప్పట్లో తనకు తెలుగు పూర్తిగా రాకపోవడంతో ఆయన సరదా మాటలు అర్థం కావడానికి కూడా కొంత సమయం పట్టిందని పేర్కొన్నారు.

మోహన్ బాబు మాట్లాడే తీరు, అందరినీ సరదాగా పిలిచే అలవాటు మిగతా హీరోలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండేదని మీనా చెప్పారు. అయితే కాలక్రమేణా ఆయన బయట కనిపించే వ్యక్తిత్వానికి భిన్నంగా ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని అర్థమైందన్నారు. ఆయన కుటుంబ సభ్యులు లక్ష్మి, విష్ణు, మనోజ్‌లతో కలిసి అంతాక్షరి, మ్యూజికల్ చైర్స్ ఆడిన జ్ఞాపకాలు ఇప్పటికీ గుర్తున్నాయని చెప్పారు.

తనకు అల్లరి, కొంటె పాత్రలు చేయడమే ఎక్కువగా ఇష్టమని మీనా వెల్లడించారు. ఎక్కువ సెంటిమెంట్ పాత్రల కంటే అలాంటి పాత్రల్లోనే తన నిజమైన వ్యక్తిత్వం ప్రతిబింబించేదని తెలిపారు.

తన వృత్తిపరమైన క్రమశిక్షణే తన బలమని మీనా స్పష్టం చేశారు. “నేను చాలా ప్రొఫెషనల్‌. నా వల్ల షూటింగ్‌కు లేదా పనికి ఎప్పుడూ ఇబ్బంది కలిగిందని ఎవరూ చెప్పలేరు” అని అన్నారు. తన సినీ ప్రయాణంలో ఇదే తనకు అతిపెద్ద బలంగా నిలిచిందని పేర్కొన్నారు.

వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలకు కూడా మీనా ఆసక్తికరంగా స్పందించారు. తనకు పెళ్లి ప్రతిపాదనలు రాలేదా అని అడిగితే, తాను చాలా చిన్న వయస్సులోనే సినిమాల్లోకి రావడంతో ప్రేమ, వ్యక్తిగత సంబంధాలను అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టిందని సరదాగా సమాధానమిచ్చారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana