
D Entr: Jul 28: జూనియర్ ఎన్టీఆర్ గాయం: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్కు ‘డ్రాగన్’ సినిమా చిత్రీకరణ సందర్భంగా భుజానికి గాయమైనట్లు ఆయన టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఈ విషయాన్ని సోమవారం (జూలై 27) విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ వార్తతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
గాయం అనంతరం జూనియర్ ఎన్టీఆర్కు వైద్యుల బృందం తక్షణమే చికిత్స అందించింది. డాక్టర్ జె. మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన వైద్యం అందించినట్లు వెల్లడించారు.
వైద్యుల సూచన మేరకు జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని టీమ్ తెలిపింది. ఈ కాలంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగనున్నట్లు సమాచారం.
అభిమానులు, శ్రేయోభిలాషులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టం చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి, కోలుకుంటున్న తీరు గురించి ఎప్పటికప్పుడు అధికారికంగా సమాచారం అందిస్తామని పేర్కొంది.
