DNews:1 NOV:వారణాసి: కాశీలో శ్రీ కాశీ నట్టుకొట్టై నగర సత్రం కొత్త భవనాన్ని ఉప రాష్ట్రపతి సీ.పి. రాధాకృష్ణన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గంగాస్నానం తన జీవితాన్ని మార్చిందని భావోద్వేగంగా తెలిపారు.“25 ఏళ్ల క్రితం నేను మాంసాహారం తీసుకునేవాడిని. ఆ సమయంలో కాశీకి వచ్చి గంగా నదిలో స్నానం చేసిన తర్వాత నా మనసు మారింది. అప్పటి నుండి నేను పూర్తిగా శాఖాహారిగా జీవిస్తున్నాను” అని రాధాకృష్ణన్‌ వెల్లడించారు.

అతను కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, అన్నపూర్ణ మాతను దర్శించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఉప రాష్ట్రపతిని సన్మానించారు.రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ, “ధర్మానికి తాత్కాలికంగా సంక్షోభం వస్తుంది కానీ అది శాశ్వతం కాదు. ఈ సత్రం దానికి ఉదాహరణ. కాశీలో ఇప్పటి మార్పులు చూడగానే ఆధ్యాత్మిక పునరుజ్జీవనం కనిపిస్తోంది. ఇది ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కృషితో సాధ్యమైంది,” అన్నారు.

తమిళ కమ్యూనిటీ చేస్తున్న సేవలను ఆయన అభినందిస్తూ, “సత్రం నిర్మాణం కోసం వారు ₹60 కోట్లు విరాళం ఇచ్చారు. తమిళ సంస్కృతిని కాశీలో వారు నిలబెట్టారు. 1863లో తమిళ సంఘం ఏర్పడటం కాశీ–తమిళ బంధానికి ప్రతీకగా నిలిచింది,” అని పేర్కొన్నారు.అన్నపూర్ణాదేవి విగ్రహ చరిత్రను గుర్తు చేస్తూ, “100 ఏళ్ల క్రితం ఈ విగ్రహాన్ని దొంగలు కెనడాకు తీసుకెళ్లారు. 2021లో కెనడా దానిని మళ్లీ భారత్‌కు అప్పగించింది. ఇది కాశీ ఆధ్యాత్మిక వైభవ పునరుద్ధరణకు సంకేతం,” అని చెప్పారు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana