
DSports 2 Dec:న్యూఢిల్లీ: టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి జాతీయ సెలక్షన్ కమిటీ నిర్ణయాలపై ఘాటుగా స్పందించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ, తుది జట్టు ఎంపిక విషయంలో సెలెక్టర్లపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
నితీష్ కుమార్ రెడ్డిపై అశ్విన్ ప్రశ్నలు: సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన మొదటి వన్డేలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అందుబాటులో లేనప్పటికీ, జట్టులోకి కొత్తగా ఎంపికైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy)ని ప్లేయింగ్ XI నుంచి తప్పించడంపై అశ్విన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
నిలకడగా దేశవాళీ క్రికెట్‌లో పరుగులు చేస్తున్నా కూడా అవకాశాలు దక్కని సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) విషయంలో కూడా సెలెక్టర్ల వైఖరిపై అశ్విన్ గతంలో అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సరైన కమ్యూనికేషన్ లేకుండా ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
