D Sports: Jul 27: వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన యువ సంచలనం

యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లో మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. జింబాబ్వేతో ముగిసిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆయన, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (POTM), ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ (POTS) అవార్డులను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు.

కేవలం 15 సంవత్సరాల 121 రోజుల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును అందుకున్న అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు నెలకొల్పారు. ఈ క్రమంలో అఫ్గానిస్థాన్‌కు చెందిన ముజీబ్ ఉర్ రెహ్మాన్ (16 సంవత్సరాల 328 రోజులు) పేరిట ఉన్న గత రికార్డును ఆయన అధిగమించారు.

సిరీస్‌లో నిలకడైన ప్రదర్శనతో పాటు కీలక మ్యాచ్‌లో విజయం అందించడంలోనూ వైభవ్ కీలక పాత్ర పోషించారు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును గెలుచుకున్న రెండో అతి పిన్న వయస్కుడిగా కూడా ఆయన మరో ఘనత సాధించారు.

ఈ జాబితాలో సియెర్రా లియోన్‌కు చెందిన అలుసిన్ టురే (15 సంవత్సరాల 74 రోజులు) తొలి స్థానంలో ఉండగా, వైభవ్ సూర్యవంశీ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. చిన్న వయసులోనే పరిణతి చెందిన ఆటతీరు, దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్న ఈ యువ సంచలనం భవిష్యత్తులో భారత క్రికెట్‌కు మరిన్ని విజయాలు అందిస్తాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana