
DSports 2 Dec:అహ్మదాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో కర్ణాటక స్టార్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ అద్భుత ప్రదర్శన చేశాడు. మంగళవారం (డిసెంబర్ 2, 2025) దాయాది జట్టు తమిళనాడుపై జరిగిన మ్యాచ్‌లో పడిక్కల్ మెరుపు సెంచరీతో చెలరేగడంతో, కర్ణాటక ఏకంగా 145 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు.. విజయ్ కుమార్ వైశాక్, శ్రేయస్ గోపాల్, ప్రవీణ్ దూబేల స్పిన్ దాటికి తట్టుకోలేకపోయింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సాయి సుదర్శన్ సహా కీలక బ్యాటర్లందరూ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు.
తమిళనాడు కేవలం 14.2 ఓవర్లలోనే 100 పరుగులకే ఆలౌట్ అయింది.
కర్ణాటక బౌలర్లలో లెగ్ స్పిన్నర్లు శ్రేయస్ గోపాల్ మరియు ప్రవీణ్ దూబే చెరో 3 వికెట్లు పడగొట్టారు.
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున రిటైన్ అయిన పడిక్కల్, ఈ అద్భుత ఫామ్‌తో రాబోయే సీజన్‌కు సన్నద్ధమవుతున్నట్లు స్పష్టం చేశాడు. ఈ విజయంతో కర్ణాటక, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమ మూడో విజయాన్ని నమోదు చేసింది
