
DSports 2 Dec:న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ప్రస్తుత జట్టు ప్రదర్శన, ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో వరుస ఓటములపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జట్టు పరాజయాలకు హెడ్ కోచ్‌తో పాటు ఆటగాళ్లు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని, అయితే ముందుగా మాత్రం కోచే బాధ్యత తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి జట్ల చేతిలో వైట్‌వాష్‌కు గురవడంపై రవిశాస్త్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో విరాట్ కోహ్లీతో కలిసి జట్టుకు అద్భుత విజయాలు అందించిన శాస్త్రి, భారత టెస్ట్ క్రికెట్ పతనంపై తన బాధను వ్యక్తం చేశారు.
“నా కాలంలో అయితే నేనే తొలి బాధ్యత తీసుకునేవాడిని”: ఒక పోడ్‌కాస్ట్ టీజర్‌లో మాట్లాడిన రవిశాస్త్రి, గౌతమ్ గంభీర్‌ను వెనకేసుకొస్తున్నారా? అనే ప్రశ్నకు సూటిగా సమాధానం ఇచ్చారు.
