
DSports 2 Dec:హైదరాబాద్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సుదీర్ఘ విరామం తర్వాత దేశవాళీ క్రికెట్‌లోకి అద్భుతమైన పునరాగమనం చేశాడు. మంగళవారం (డిసెంబర్ 2, 2025) సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq Ali T20 Trophy – SMAT) లో భాగంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బరోడాకు ప్రాతినిధ్యం వహించిన హార్దిక్, తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించి జట్టుకు ఘన విజయాన్ని అందించాడు.
42 రోజుల తర్వాత క్రికెట్‌లోకి: గత సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్‌లో ఎడమ తొడ కండరాల గాయానికి గురైన హార్దిక్, ఆ తర్వాత దాదాపు 42 రోజులు బెంగళూరులోని బీసీసీఐ నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ఫిట్‌నెస్ రిహాబిలిటేషన్ పూర్తి చేసుకుని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు.
