D Spiritual: Dec 8: వాస్తు శాస్త్రం ప్రకారం అటాచ్డ్‌ బాత్రూమ్‌ విషయంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. చిన్న చిన్న పొరపాట్లు కూడా అనేక ఇబ్బందులకు దారితీస్తాయి. ముఖ్యంగా ఇంట్లో అశాంతి పెరగడం, భార్యాభర్తల మధ్య విబేధాలు రావడం, దాంపత్య జీవితంలో ప్రతికూల ఫలితాలు ఎదురుకావడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ప్రతి ఇంటిలో బాత్రూమ్ తప్పనిసరి. నేటి ఇళ్లలో ప్రతి బెడ్రూమ్‌కు అటాచ్డ్‌ బాత్రూమ్‌ను నిర్మించుకుంటున్నారు. ఇది వాస్తు నియమాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటున్నప్పటికీ, దాన్ని ఉపయోగించే ఆలుమగలు చేసే చిన్న తప్పిదాల వల్ల ఇంటి శాంతి దెబ్బతినే అవకాశం ఉంది.

వాస్తు శాస్త్రం ప్రకారం అటాచ్డ్‌ బాత్రూమ్‌ భార్యాభర్తల సంబంధాలపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. అందువల్ల కలిసి నిద్రించే సమయంలో కాళ్లు బాత్రూమ్ వైపు ఉండకుండా చూసుకోవాలి. కాళ్లు ఆ దిశగా ఉంచితే దాంపత్య జీవితంలో గొడవలు, విభేదాలు పెరిగే అవకాశం ఉందని వాస్తు చెబుతుంది. అలాగే నిద్రకు ముందు తప్పనిసరిగా బాత్రూమ్ తలుపు మూసివేయాలి. బాత్రూమ్‌ తలుపు తెరిచి ఉంచితే దాంపత్యంలో చిన్న చిన్న మనస్పర్థలు పెరగడం మాత్రమే కాదు, ఆర్థిక పరిస్థితులు కూడా ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి పడుకునే ముందు బాత్రూమ్ తలుపు మూసివేయడం చాలా ముఖ్యం.

బాత్రూమ్‌లకు పెయింట్‌ వేయేటప్పుడు లైట్‌ కలర్స్‌ ఉపయోగించాలి. గోధుమ, తెలుపు రంగులు బాత్రూమ్‌ వాతావరణానికి అనుకూలంగా పనిచేస్తాయి. అలాగే బాత్రూమ్‌లో నీలి రంగు బకెట్ లేదా టబ్‌ ఉంచడం శుభప్రదంగా భావించబడుతుంది. అయితే నలుపు, ఎరుపు రంగుల బకెట్లు లేదా టబ్‌లు వాస్తు దృష్ట్యా ప్రతికూల ప్రభావం చూపవచ్చని చెబుతారు. చాలా మంది బాత్రూమ్‌లో బట్టలు ఉతకడం, ఆ తడి బట్టలను అక్కడి నల్లాలపై ఉంచడం వంటి అలవాట్లు పాటిస్తుంటారు. కానీ ఇలా చేయడం వాస్తు దోషాలు కలిగించవచ్చు. తడి బట్టలను బాత్రూమ్‌లో ఎక్కువసేపు ఉంచితే ప్రతికూల శక్తులు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల బాత్రూమ్‌లో నానబెట్టిన లేదా తడి బట్టలను ఏ పరిస్థితుల్లోనూ ఎక్కువసేపు ఉంచకూడదు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana