
D Spiritual: Dec 5: మనలో చాలామంది కోరుకున్న కోరికలు నెరవేరకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి సందర్భాల్లో వారాహి అమ్మవారి ఆశీర్వాదం కోసం ప్రార్థించడం ఎంతో శ్రేయస్కరం. ప్రస్తుతం వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు ప్రారంభమైన సందర్భంలో, అమ్మవారి శక్తి స్వరూపాల్లో వారాహి కూడా ప్రముఖ స్థానం కలిగి ఉన్నారని గమనించాలి. లలితాదేవికి సైన్యాధిపతిగా భావించే వారాహి అమ్మవారు భక్తులు కోరుకున్న కోరికలను కోరినట్లే నెరవేర్చుతారని విశ్వాసం ఉంది. అమ్మవారిని పూజించడం ద్వారా సమస్యలు తొలగి మంచి ఫలితాలు లభిస్తాయని చెబుతారు.
వారాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల అపారమైన జ్ఞానం పొందే అవకాశం ఉంటుందని పురాణాలు సూచిస్తున్నాయి. అమ్మవారికి సంబంధించిన మంత్రాలు, అష్టోత్తర శతనామాలను పఠించడం ద్వారా శుభఫలితాలు లభిస్తాయి. పంచమి, సమయసంకేత, దండనాథా, వారాహి, సంకేతా, పోత్రిణి, శివా, మహాసేన, వార్తాళి, అరిఘ్ని, ఆజ్ఞా, చక్రేశ్వరి అనే 12 నామాలను రోజుకు 11 సార్లు జపిస్తే మంచి ఫలితాలు దక్కుతాయని నమ్మకం ఉంది.
“ఐమ్ క్లీమ్ సౌ” అనే స్తోత్రాన్ని జపించడం ద్వారా సమస్యలకు పరిష్కారాలు లభించడంతో పాటు అనుకూల ఫలితాలు దక్కే అవకాశం ఉంటుంది. ప్రతిరోజూ సాయంత్రం సమయంలో వారాహి అమ్మవారిని పూజించడం శుభప్రదమని భావిస్తారు. అమ్మవారి చిత్రపటం, గంధం, పసుపు రంగు పూలు, సాంబ్రాణి ధూపం ఉపయోగించి భక్తితో పూజిస్తే అనుగ్రహం అందుతుంది.
పూజ సమయంలో మహాదీపం మరియు చిన్నదీపం వెలిగించడం శుభకరంగా భావించబడుతుంది. నల్ల బెల్లం మరియు రెండు లవంగాలను నైవేద్యంగా సమర్పించడం మంచిదిగా చెప్పబడింది. నరదృష్టి, చెడు దృష్టి లేదా ఎదుటివారి శాపం తగలకుండా ఉండాలంటే అష్టమి లేదా పంచమి తిథుల్లో వారాహి అమ్మవారిని ప్రత్యేకంగా పూజించడం ఉత్తమం. శుక్ర గోరల్లో పరిహారం చేయడం ద్వారా కూడా శుభ ఫలితాలను సులభంగా పొందవచ్చని విశ్వాసం ఉంది.
