
D Spiritual: Dec 5: హిందూ మతంలో పూజ సమయంలో దేవుడి పటాలకు లేదా విగ్రహాలకు పూలమాలను వేయడం, పువ్వులతో పూజ చేయడం ఒక సాధారణ పద్ధతి. అయితే ఈ సమయంలో పువ్వులు లేదా దండలు అకస్మాత్తుగా కింద పడిపోతే, భక్తులలో అనేక సందేహాలు ఉటపడుతాయి. కొందరు దీన్ని శుభసంకేతంగా భావిస్తారు, మరికొందరు ఏదైనా ప్రతికూలమైనది జరగబోతుందేమోనని ఆందోళన చెందుతారు.
ప్రతి హిందూ ఇంటిలో ఉదయాన్నే పూజలో పువ్వులు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. పువ్వులు లేకుండా పూజ సంపూర్ణం కాదు. ఇంట్లో పూజ చేసినా, గుడికి వెళ్లినా దేవుడికి పూలు లేదా దండలు సమర్పిస్తారు. అయితే ఇలాంటి సమయంలో పువ్వు కింద పడితే అడుగడుగునా సందేహాలు వెంటాడతాయి. దీన్ని కొంతమంది శుభ సూచికంగా భావిస్తే, మరికొందరు అశుభ సంకేతంగా భావిస్తారు. కానీ దీని అసలు అర్థం ఏమిటో తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నించరు.
కొంతమంది ఆచారాలు, నమ్మకాల ప్రకారం దేవుడికి సమర్పించిన పువ్వు లేదా మాల కింద పడిపోతే, అది మీ జీవితంలో మార్పుకు సంకేతమని చెబుతారు. మీరు ఇటీవల ఏదైనా ముఖ్య నిర్ణయం తీసుకుని ఉంటే, దాన్ని మళ్లీ పరిశీలించమని సూచించే దివ్య సంకేతంగా భావిస్తారు. అదేవిధంగా రాబోయే ఇబ్బందులు, సవాళ్లకు ముందుగానే హెచ్చరికగా కూడా కొందరు దీన్ని అర్థం చేసుకుంటారు.
దేవునికి సమర్పించిన పువ్వు సమయం, ప్రదేశం బట్టి కూడా ఫలితాన్ని ఇస్తుందని విశ్వాసం ఉంది. తప్పు సమయంలో పూజ చేయడం లేదా సరైన స్థలంలో కూర్చోకుండా పువ్వులు సమర్పించడం వల్ల పువ్వులు కింద పడుతాయని కొందరు నమ్ముతారు. దేవుడికి సమర్పించిన పువ్వు నేలపై పడుతే, భగవంతుడు ఆ పూజను అంగీకరించలేదని, కోరిన కోరిక నెరవేరకపోవచ్చని భావించే వారు కూడా ఉన్నారు.
పురాణాలు మరియు కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం భగవంతుడికి సమర్పించిన పువ్వు లేదా మాల కిందపడటం అంటే దేవుడు అక్కడ ఉన్నాడని, మీ భక్తిని స్వయంగా గమనిస్తున్నాడని ఒక శుభసూచన కూడా కావచ్చు. అలాంటి సందర్భంలో భక్తుడు తన జీవితంలో ఆధ్యాత్మిక ప్రగతికి అనుగుణంగా సానుకూల మార్పులు చేసుకోవాలి అని చెబుతారు.
