
DSports Dec17 2025: ఐపీఎల్ 2026 మినీ వేలంలో మన తెలంగాణ కుర్రాడు, కరీంనగర్ జిల్లాకు చెందిన పేరాల అమన్ రావు (Aman Rao Perala) అద్భుతం చేశాడు. అబుదాబిలో జరిగిన ఈ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇతడిని సొంతం చేసుకుంది.రూ. 30 లక్షలు .రాజస్థాన్ రాయల్స్ (RR).కరీంనగర్ జిల్లా నుంచి ఐపీఎల్‌కు ఎంపికైన తొలి ఆటగాడిగా అమన్ గుర్తింపు పొందారు. కరీంనగర్ జిల్లా, సైదాపూర్ మండలం, వెన్నంపల్లి గ్రామం. అమన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) తరపున అండర్-19, అండర్-23 విభాగాల్లో రాణించాడు. ప్రస్తుతం హైదరాబాద్ అండర్-23 రంజీ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు.
- ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అమన్ సంచలనం సృష్టించాడు. టీమిండియా వెటరన్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ వేసిన ఒకే ఓవర్లో 24 పరుగులు (6, 4, 4, 6, 4) రాబట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 52* పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇతని బ్యాటింగ్ శైలిని చూసి చాలామంది శుభ్‌మన్ గిల్ ఆటతీరుతో పోలుస్తున్నారు.
- అమన్ రావు తండ్రి పేరు శ్రీనివాస్ రావు. సాధారణ గ్రామీణ నేపథ్యం నుండి వచ్చి, కఠోర శ్రమతో ఐపీఎల్ స్థాయికి ఎదగడం పట్ల వెన్నంపల్లి గ్రామస్థులు మరియు జిల్లా క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
