తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయినట్లు సమాచారం. ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్న సీఎం లండన్ నుంచి అమెరికా వెళ్లాల్సి ఉండగా, అనుమతి లభించకపోవడంతో అమెరికా పర్యటనను రద్దు చేసుకుని నేరుగా హైదరాబాద్‌కు తిరిగి రానున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 19 నుంచి 30 వరకు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. పర్యటనలో భాగంగా బ్రిటన్‌తో పాటు అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలను సందర్శించి, ఆయా దేశాల్లో అమలు చేస్తున్న విద్యా విధానాలు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం పలు అంతర్జాతీయ యూనివర్సిటీల సందర్శనకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా రూపొందించారు.

ప్రస్తుతం లండన్‌లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, లండన్ బిజినెస్ స్కూల్‌ను సందర్శించాల్సి ఉంది. ఈ నెల 23 వరకు లండన్‌లో పర్యటించిన అనంతరం అక్కడి నుంచి అమెరికాలోని బోస్టన్‌కు వెళ్లాల్సి ఉంది. 29 వరకు అమెరికాలో పర్యటించి, 30న హైదరాబాద్‌కు తిరిగి రావాల్సి ఉంది.

అయితే, విదేశీ పర్యటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం సీఎంవో అధికారులు దరఖాస్తు చేశారు. యూకే పర్యటనకు అనుమతి లభించినప్పటికీ, అమెరికా పర్యటనకు అనుమతి రాకపోవడంతోనే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం.

By Rajini

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana