
D Spiritual: Nov 17:
మీరు కోరుకున్న కోరిక నెరవేరాలి అనుకుంటే సోమవారం రోజు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేస్తే తప్పకుండా శుభఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు. మామూలుగా ఇంట్లో లేదా ఆలయాల్లో పూజ చేస్తూ దేవుడిని కోరికలు తీర్చమని ప్రార్థిస్తూ ఉంటాము. కొన్నిసార్లు దానాలు, ధర్మాలు, అనేక పరిహారాలు చేసినా కూడా కోరిన కోరికలు నెరవేరవు. అట్టి సందర్భాల్లో సోమవారం పాటించాల్సిన ఈ ప్రత్యేక విధానం ఎంతో శక్తివంతమని చెబుతున్నారు.
వారంలో సోమవారం రోజు పరమేశ్వరుడికి అంకితం చేయబడింది. ఈ రోజున పరమేశ్వరుడిని అత్యంత భక్తి, శ్రద్ధలతో పూజించాలి. అందుతో పాటు ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని చేస్తే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం. ముందుగా ఇంట్లోని పూజ గదిలో పరమేశ్వరుడి విగ్రహం లేదా ఫోటో ముందు రెండు లవంగాలు మరియు కొద్దిగా కర్పూరం ఉంచాలి.
తర్వాత “ఓం నమః శ్శివాయ” అనే బీజాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. జపం పూర్తయ్యాక ఆ రెండు లవంగాలు, కర్పూరాన్ని కుడిచేతిలో తీసుకుని, మీరు కోరిన కోరికను స్పష్టంగా పరమేశ్వరుడికి తెలియజేయాలి.
తర్వాత ఆ లవంగాలు మరియు కర్పూరాన్ని కలిపి ఒక ప్రమిదలో వేసి వెలిగించాలి. ఈ విధంగా సోమవారం రోజు ఈ పరిహారం పాటిస్తే శివానుగ్రహం లభించి, మీ కోరిక నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు.
