D Spiritual: Nov 17: 🔥 దేవుడి ఆరాధన – ప్రాముఖ్యత

దేవుడి విగ్రహానికి లేదా పటానికి ధూపధీప నైవేద్యాలు సమర్పించటం మన ఆరాధనా పద్ధతి. ఉదయము వెలిగించే దీపము కన్నా ప్రదోష కాలమందు అంటే సంధ్యా సమయమున వెలిగించు దీపం అత్యంత మంగళకరమైనదిగా పెద్దలు చెప్తారు. పూజలో అత్యంత ముఖ్యమైనది దీపం, ఆ తర్వాత ధూపం, పువ్వులు, పసుపు కుంకుమలు, చందనం, విభూతులు, కొబ్బరికాయ, అరటిపండ్లు, వక్క, తమలపాకులు, మంగళ హారతి మొదలైనవి ప్రాధాన్యము కలిగినటువంటివి. కాబట్టి పూజ చేయువారిపై వీటి అనుకూల శక్తి, ప్రభావము వెంటనే పడుతుంది. అష్టోత్తరములు, శ్లోకములు మనలో దాగి ఉన్న దైవీశక్తులను మేల్కొలిపి మనకు మానసిక, శారీరక శుభాలను కలగజేస్తాయి. ఇలా మనం దేవుడిని ప్రసన్నము చేసుకొని అతని దీవెనలను పొందునట్లు చేయడమే కాక పూజకై మనము చేసే క్రియలన్నియూ మనకు శుభమును చేకూరుస్తాయి.

🪔 దీపం వెలిగించే విధానము మరియు స్థానము

దీపమును, నేలపై ఏమీ వేయకుండా సరాసరి నేలపై పెట్టి వెలిగించకూడదు. అరటి ఆకును గానీ, తమలపాకును గానీ, పళ్లెమును కానీ, నీటితో శుభ్రం చేసి, వాటిని ముగ్గు వేసిన నేలపై ఉంచి దీపం కుంది పెట్టాలి. ఇక ఇంటియందు దేవతారాధనకై మనమొక ప్రత్యేక స్థానమును ఏర్పాటు చేసుకోవాలి. ఆ స్థానం నేలకు కాస్త పై భాగంలో ఉండేటట్లు చూసుకోవాలి. నేలను తాకునట్లు పూజా ద్రవ్యములు మరియు పవిత్ర గ్రంథములు ఉంచకూడదు. దీపములోని చమురుకై ఆవునెయ్యిని కాని నల్ల నువ్వుల నూనెను వాడుట మంచిది. ఎట్టి పరిస్థితిలోనూ గేదె నెయ్యితో దీపారాధన చెయ్యకూడదు.

🧭 దీపం ముఖము (దిశ)

ఉదయము పూజ చేసేటప్పుడు దీపము యొక్క ముఖము తూర్పు దిక్కుగా ఉంచాలి. సాయంత్రం పూజలో ఒక వత్తి తూర్పు దిక్కుగా మరొకటి పడమర దిక్కుగా ఉంచి దీపము వెలిగించాలి. మూడు వత్తులను వేసి వెలిగిస్తే తూర్పు, పడమర మరియు ఉత్తరము దిక్కుగా వెలిగించాలి. ఇక ఐదు వత్తులను వెలిగించాలి అనుకున్నప్పుడు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ మరియు ఈశాన్య దిక్కుగా వత్తులనుంచి వెలిగించాలి.

🌬️ దీపాన్ని ఆర్పే నియమాలు మరియు శ్లోకం

ఇలా వెలిగించిన దీపాన్ని ఆర్పేయాల్సి వస్తే నోటితో ఊదకూడదు. వత్తిని చమురులోకి లాగితే అదే ఆరిపోతుంది లేదా వెలుగుతున్న వత్తిపై కొద్దిగా నూనె పోస్తే ఆరిపోతుంది. దీపం ఆరిపోయినప్పుడు… ఆరిపోయింది అని పలకకుండా… “దీపం కొండెక్కింది” అని అనాలి అని శాస్త్ర వచనం.

దీపారాధన చేస్తున్నప్పుడు చదువుకోవాల్సిన శ్లోకం:

దీపం జ్యోతి పరంబ్రహ్మ| దీపం సర్వతమోపహం|| దీపేన సాధ్యతే సర్వం| సంధ్యాదీపం నమోస్తుతే!

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana