
DNews Dec22 2025:తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ఘాటుగా స్పందించారు. కేసీఆర్ ‘ఫామ్‌హౌస్’ రాజకీయాలు మానుకొని, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని బహిరంగ సవాల్ విసిరారు. “రోడ్డు మీద కాదు.. అసెంబ్లీలో చర్చిద్దాం రా!” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు కృష్ణా, గోదావరి జలాల విషయంలో గత పదేళ్లలో జరిగిన ‘జల ద్రోహం’పై చర్చించేందుకు జనవరి 2, 2026 నుంచి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు.”నీళ్లు – నిజాలు” అనే అంశంపై ఫేస్-టు-ఫేస్ చర్చకు రావాలని కేసీఆర్‌ను కోరారు. ఒక రోజు కృష్ణా జలాలు, మరో రోజు గోదావరి అంశాలపై చర్చిద్దామని ప్రతిపాదించారు.ఆర్థిక ఉగ్రవాదులు కేసీఆర్, కేటీఆర్‌లను రేవంత్ రెడ్డి ‘ఆర్థిక ఉగ్రవాదులు’గా అభివర్ణించారు. 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు.
