బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులకు ఆయన ఘన నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన స్పందిస్తూ, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న విజన్ ఏమిటని ప్రశ్నించారు.

