D Spiritual: Nov 13: కార్తీక మాసం అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి పవిత్ర నదీ స్నానాలు, దీపారాధనలు, వ్రతాలు, ముఖ్యంగా దానధర్మాలు. ముఖ్యంగా ఈ నెలలో చేసే దానధర్మాలు ప్రత్యేక ఫలితాలను అందిస్తాయట. ఈ మాసంలో దానం చేయడం వల్ల అజ్ఞానం అనే చీకటి తొలగి, జ్ఞానం అనే వెలుగు సిద్ధిస్తుందని చెబుతారు. మన శక్తి కొద్దీ, మనస్ఫూర్తిగా అవసరంలో ఉన్నవారికి చేసే దానం ఉత్తమ ఫలితాలను అందిస్తుందని పండితులు పేర్కొన్నారు. కార్తీక మాసంలో తప్పకుండా చేయాల్సిన ముఖ్యమైన దానాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

కార్తీక మాసంలో దీపారాధన ఎంత ముఖ్యమో, దీప దానం కూడా అంతే పవిత్రమైనది. ఆలయాల్లో శివలింగం సన్నిధిలో, తులసి కోట వద్ద లేదా నదీ తీరాలలో దీపాలను వెలిగించడానికి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, కొత్త ప్రమిదలు, వత్తులను దానం చేయాలట. కార్తీక పౌర్ణమి నాడు దీప దానం అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడింది. ఇలా దీప దానం చేయడం వల్ల అజ్ఞానం అనే చీకటి తొలగి, జ్ఞానం, సంపద, ఆరోగ్యం, లక్ష్మీ కటాక్షం లభిస్తాయట. అదేవిధంగా, తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని చెబుతున్నారు.

అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని అంటుంటారు. ప్రత్యేకించి పవిత్ర కార్తీక మాసంలో అన్నదానం చేయడం చాలా మంచిదని చెబుతున్నారు. పేదలకు, వృద్ధులకు, సాధువులకు, లేదా ఆలయాల్లో ప్రసాద రూపంలో భోజనం అందించడం చాలా మంచిదట. ముఖ్యంగా, కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పెరుగు అన్నం దానం చేయడం కూడా అద్భుతమైన పుణ్యాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

చలికాలం ప్రారంభమయ్యే ఈ కార్తీక మాసంలో వస్త్ర దానం చేయడం వల్ల అత్యంత పుణ్యం లభిస్తుందట. అవసరంలో ఉన్నవారికి, పేద బ్రాహ్మణులకు, ఆలయాల్లోని అర్చకులకు కొత్త వస్త్రాలు దానం చేయడం మంచిది. ఇలా వస్త్ర దానం చేయడం వల్ల గౌరవం, యశస్సు, సౌభాగ్యం, శివానుగ్రహం లభిస్తాయని నమ్మకం.

స్వయంపాకం అంటే వంట చేసుకోవడానికి ఉపయోగపడే అన్ని రకాల నిత్యావసర వస్తువులను దానం చేయడం మంచిది. బియ్యం, పప్పులు, నూనె, ఉప్పు, కూరగాయలు, నెయ్యి, పసుపు వంటి వంట సామగ్రిని ఒక బ్రాహ్మణుడికి లేదా అవసరంలో ఉన్న కుటుంబానికి దానం చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. అలాగే, కార్తీక మాసంలో ఉసిరికాయలు దానం చేయడం కూడా శుభప్రదం అని చెబుతున్నారు.

గోదానం అనేది చాలా పెద్ద దానం. అది చేయలేనివారు గో సేవ కూడా చేయవచ్చట. గోవును దానం చేయడం సాధ్యం కాకపోతే, ఆలయాల్లో లేదా గోశాలల్లో ఆవులకు దానంగా మేత లేదా ధనం సమర్పించడం మంచిది. గో సేవ చేయడం వల్ల శ్రీ కృష్ణుడి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana