D Spiritual: Nov 13: నవగ్రహాలు మన జీవితంలో అనేక సంఘటనలకు కారణమని కర్మసిద్ధాంతం నమ్మేవారు విశ్వసిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జాతకపరంగా నవగ్రహ పరివర్తనను అనుసరించి శుభ, అశుభ ఫలితాలుంటాయని చెబుతారు. గ్రహాధిపత్యంతో కలిగే అశుభ ఫలితాలను తొలగించుకోవడానికి నవగ్రహ ఆరాధన చేయడం మంచిదని జ్యోతిష్కులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా, నవగ్రహ పూజలో దీపారాధనకు వాడాల్సిన వత్తులు, ప్రమిదెలు మరియు నూనెల గురించి తెలుసుకోవడం జాతకులకు సుఖసంతోషాలను చేకూరుస్తుందని నిపుణులు అంటున్నారు.

సూర్యారాధనలో కుంకుమ వర్ణపు ఏకవత్తిని, ఎర్రరంగు ప్రమిదెలో ఆవునెయ్యి ఉపయోగించి వెలిగించి పూజ చేయాలి. చంద్ర గ్రహ పూజలో ఏకిన దూదితో తయారు చేయబడిన రెండు వత్తులను, వెండి ప్రమిదెలో నేతిని వాడాలి. కుజ గ్రహ పూజలో కుంకుమ రంగు వర్ణంలో ఉన్న మూడు వత్తులను గాని 9 వత్తులతో గాని, ఎర్రటి ప్రమిదెలలో నువ్వుల నూనెను వాడాలి. బుధ గ్రహ పూజలో తెల్లజిల్లేడు వత్తులు నాలుగింటిని గాని, ఎర్రటి ప్రమిదెలో తమలపాకు వేసి, దీపారాధనకు కొబ్బరి నూనెను వాడాల్సి ఉంటుంది.

గురుగ్రహ పూజ చేయటానికి తామర వత్తులతో తయారు కాబడిన ఐదు వత్తులను కంచు ప్రమిదెలలో వేసి నేతిని ఉపయోగించి వెలిగించాలి. శుక్ర గ్రహ పూజలో కూడా తామర వత్తులతో తయారు చేసిన ఆరు వత్తులను వేసి, ఆవునేతిని వినియోగించి వెలిగించాలి. శని గ్రహ పూజకు నల్లని ఏడు వత్తులను, స్టీలు ప్రమిదెలో వెలిగించి, దీపారాధనకు నువ్వుల నూనెను వినియోగించాలి.

రాహు గ్రహ పూజకు నలుపు వర్ణం కలిగిన ఎనిమిది వత్తులను నిమ్మకాయ డొప్పలో వెలిగించాలి. దీపారాధనలో అష్టమూలికా తైలాన్ని వినియోగించాలి. కేతు గ్రహ పూజలో తెల్లజిల్లేడుతో తయారు కాబడిన తొమ్మిది వత్తులను ఉపయోగించి, దీపారాధనలో కొబ్బరి నూనెను ఉపయోగించాలి. ఇలా ఆయా గ్రహాల శాంతులకు ఈ విధంగా దీపారాధన చేయడం ద్వారా జాతకులు సుఖసంతోషాలతో జీవిస్తారని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana