D Spiritual: Nov 13: ఆదివారం రోజును సూర్య భగవానుడికి అత్యంత ఇష్టమైనదిగా భావిస్తారు. ఈ రోజున చెప్పబడిన విధంగా పూజలు చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. ఆదివారం రోజు సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఈ రోజున చేసేటటువంటి పూజలు మరియు పరిహారాలు ప్రత్యేక ఫలితాలను అందిస్తాయని నమ్మకం. అలాగే ఈ రోజున పూజ చేయడం వల్ల ఆరోగ్యం, శాంతి, కీర్తి లభిస్తాయని భక్తులు నమ్ముతారు. ఈ పూజలో భాగంగా సూర్యుడికి నీరు సమర్పించడం, అర్ఘ్యం ఇవ్వడం, మంత్రాలు చదవడం, దానం చేయడం వంటివి ప్రత్యేక ఫలితాలను ఇస్తాయి.

ఆదివారం పూజా విధానం విషయానికి వస్తే, ఆదివారం రోజు ఉదయాన్నే సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి నీరు సమర్పించాలి (అర్ఘ్యం ఇవ్వాలి). ఇలా అర్ఘ్యం ఇచ్చేటప్పుడు “ఓం సూర్యాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ఆదిత్యాయ నమః” వంటి మంత్రాలను జపించాలట. అలాగే, ఇంట్లో ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని చెబుతారు. అదేవిధంగా, ఆదివారం రోజున బెల్లం, పాలు, బియ్యం, ఎరుపు రంగు వస్త్రాలు, రాగి పాత్రలు వంటివి పేదలకు దానం చేయాలని సూచిస్తున్నారు.

కొందరు భక్తులు ఆదివారం రోజున ఉపవాసం ఉంటారు. వీరు సూర్యాస్తమయం తర్వాత ఉప్పు, నూనె లేని భోజనం చేస్తారు. మరుసటి రోజు ఉదయం సూర్యుడికి నీరు సమర్పించిన తర్వాత ఉపవాసం విరమిస్తారు. ఆదివారం నాడు సూర్యుడిని పూజించడం వల్ల ఆరోగ్యం, శక్తి, విజయం లభిస్తాయట. జాతకంలో సూర్యుడి స్థానం బలంగా మారుతుందని చెబుతున్నారు. అలాగే ఇంట్లో శాంతి, కీర్తి లభిస్తాయట. దుష్ట శక్తులు తొలగిపోయి, ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని నమ్ముతారు. మరి ముఖ్యంగా, ఆదివారం రోజు మద్యపానం, మాంసం వంటి వాటికి దూరంగా ఉండాలని పండితులు సలహా ఇస్తున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana