
పంజాబ్‌లోని పటియాలా సమీపంలో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అమృత్‌సర్‌కు వెళ్తున్న ఈ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఐదు బోగీలకు వ్యాపించాయి. దీంతో బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. అయితే అప్రమత్తమైన ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది బ్రేకింగ్ న్యూస్ కావడంతో మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చిన వెంటనే అప్‌డేట్ చేస్తాం. తాజా సమాచారం కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి.
