D Spiritual: Dec 5: ఇంట్లో మొక్కలు పెంచుకోవడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. కొందరు తమకు నచ్చిన మొక్కలను తీసుకువచ్చి ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. అయితే ఇంట్లో మొక్కలు పెంచుకునే సమయంలో తప్పకుండా వాస్తు టిప్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని మొక్కలను అసలే ఇంటిలో పెట్టుకోవద్దని చెబుతున్నారు. ఇవి ఇంట్లో అనేక సమస్యలను తీసుకొచ్చే అవకాశముందని చెబుతారు. ఇప్పుడు ఇంట్లో పెట్టుకోకూడని మొక్కలు ఏవో చూద్దాం.

వాస్తు నిపుణుల మాట ప్రకారం, ఇంట్లో మొక్కలను పెంచుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఎందుకంటే కొన్ని మొక్కలు ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తే, మరికొన్ని మొక్కలు మాత్రం కష్టాలు, సమస్యలు, నష్టాలను తీసుకొస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటిలో ప్రతికూల శక్తిని పెంచే మొక్కలను తప్పించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

బ్రహ్మజెముడు మొక్క: ఈ మొక్క చూడటానికి చాలా అందంగా ఉంటుంది. దీన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంటికి అందం కూడా వస్తుంది. కానీ వాస్తు ప్రకారం ఈ మొక్కను ఇంటిలో అస్సలు పెట్టుకోకూడదు. దీని పదునైన ముళ్లు ఇంట్లో గొడవలు, వాగ్వాదాలు, సంఘర్షణలకు కారణమవుతాయని నమ్ముతారు. అందుకే వీటిని ఇంట్లో కాకుండా బాల్కనీ లేదా పెరట్లో మాత్రమే నాటాలని సూచిస్తున్నారు.

స్నేక్ ప్లాంట్: చాలా మంది ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటారు. ఇది గాలిని శుద్ధి చేస్తుందని భావించి హాలులో, బెడ్‌రూమ్‌లలో ఉంచుతారు. అయితే వాస్తు ప్రకారం దీన్ని ఇంటి లోపల కాకుండా ద్వారం వద్ద లేదా బాల్కనీలో ఉంచడం మంచిదని చెబుతారు. అలా చేస్తే ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుందని నమ్మకం.

లక్కీ వెదురు: లక్కీ బాంబూను చాలామంది ఇంట్లో లేదా కార్యాలయాల్లో ఉంచుతారు. కానీ సాంప్రదాయ అసలు వెదురు మొక్కలను ఇంటిలో పెట్టుకోకూడదని వాస్తు ప్రకారం చెబుతారు. నిజమైన వెదురు మొక్కను ఇంటిలో పెంచితే అశాంతి పెరుగుతుందని పండితులు అంటున్నారు.

తీగదొండ (ఐవీ) మొక్క: ఈ మొక్కను తీగ దొండ అని పిలుస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం దీన్ని ఇంటిలో ఉంచడం మంచిది కాదు. దీని వలన ఇంట్లో అనారోగ్య సమస్యలు, నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని చెబుతారు. అందుకే వీలైనంత వరకు ఈ మొక్కను ఇంట్లోపల పెంచకూడదని నిపుణులు చెప్పుతున్నారు.