
80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ఎంతో ఆనందంగా ఉంది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పించే ప్రజాస్వామ్య పాలన అందించడమే మా ప్రజా ప్రభుత్వ ధ్యేయం.
మహానీయుల త్యాగాల స్ఫూర్తితో 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాము. రైతన్నల సంక్షేమం కోసం రైతు భరోసా, రుణమాఫీ అమలు చేస్తున్నాము. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఉచిత అల్పాహార పథకం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నాము.
మెరుగైన వైద్యం కోసం అత్యాధునిక వసతులతో ఆసుపత్రులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తున్నాము. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి వంటి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల అభ్యున్నతికి మా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోంది.
