హైదరాబాద్‌లో జరుగుతున్న ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్‌ల జాతీయ సదస్సుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మీడియా ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
జర్నలిజానికి సంబంధించిన కీలక అంశాలు, ప్రజాస్వామ్యంలో పత్రికా రంగం పోషిస్తున్న పాత్ర, స్వేచ్ఛాయుతమైన మరియు బాధ్యతాయుతమైన మీడియా ఆవశ్యకతపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు.


