D Educt: Oct 15: మహాత్మా జ్యోతిబా ఫులే విదేశీ విద్యా పథకానికి దరఖాస్తు చేసుకునే గడువును అక్టోబరు 31వ తేదీ వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు.

2026 ఆగస్టు, సెప్టెంబరు ఫాల్ సీజన్‌కు అర్హత కలిగిన బీసీ, ఈబీసీ విద్యార్థులు పొడిగించిన గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. పథకానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈపాస్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు.